
Hrithik Roshan: కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’. తాజాగా ఈ సినిమా గురించి ఒక అదిరిపోయే అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ఒక కీ రోల్‌లో కనిపించనున్నట్లు సమాచారం. ఈ చిత్రం షూటింగ్ కోసం తాజాగా ఆయన చెన్నైలో ల్యాండ్ అయ్యారు.
‘జైలర్’ పార్ట్-1లోనే స్టార్ హీరోల క్యామియోలను నెల్సన్ ఏ రేంజ్‌లో ఎలివేట్ చేశారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్ పాత్రలతో ఆయన థియేటర్లలో పూనకాలు తెప్పించారు. ఇప్పుడు పార్ట్-2లో అంతకుమించి ఉండేలా హృతిక్ రోషన్ క్యారెక్టర్‌ను డిజైన్ చేసినట్లు సమాచారం. స్టోరీని మలుపు తిప్పే కీలకమైన యాక్షన్ బ్లాక్‌లో హృతిక్ ఎంట్రీ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
సూపర్ స్టార్ రజినీకాంత్ – హృతిక్ రోషన్ 40 ఏళ్ల తర్వాత వెండితెరపై కలిసి కనిపించబోతున్నారని సమాచారం. 1986లో వచ్చిన ‘భగవాన్ దాదా’ చిత్రంలో రజినీకాంత్‌తో కలిసి చైల్డ్ ఆర్టిస్ట్‌గా హృతిక్ నటించారు. మళ్లీ ఇన్నాళ్లకు ఈ ఇద్దరు టాప్ స్టార్స్ ఒకే ఫ్రేమ్‌లో, అది కూడా ఒక హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్‌లో కనిపిస్తుండటంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నెల్సన్ ఈసారి థియేటర్లలో గూస్‌బంప్స్ తెప్పించడం ఖాయమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.









