G2: సరికొత్త మేకోవర్‌తో అడవి శేష్.. ఆ సినిమా కోసమే!

G2

G2: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడవి శేష్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడానికి రెడీ అవుతున్నారు. ఆయన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన స్పై థ్రిల్లర్ ‘గూఢచారి’ చిత్రానికి సీక్వెల్‌గా ‘G2’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన సరికొత్త అప్‌డేట్ సోషల్ మీడియాలో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది.

ఈ సినిమాలో తన పాత్ర కోసం అడవి శేష్ చేస్తున్న కఠినమైన వర్కవుట్స్, బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్‌కు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్నాయి. సరికొత్త లుక్, టోన్డ్ బాడీతో శేష్ కనిపిస్తున్న తీరు సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఈ ప్రిపరేషన్ ఫోటోలను షేర్ చేస్తూ చిత్ర యూనిట్ “ది కామ్ బిఫోర్ ది స్టార్మ్” (తుఫానుకు ముందున్న ప్రశాంతత) అని పేర్కొంది. అంటే రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద ‘G2’ సృష్టించబోయే విధ్వంసానికి ఇది శాంపిల్ మాత్రమేనని హింట్ ఇచ్చింది.

Also Read :  Thella Kagitham: 'కోర్ట్' ఫేమ్ హర్ష్ రోషన్ 'తెల్లకాగితం' షూటింగ్ కంప్లీట్.. రిలీజ్ ఎప్పుడంటే?

వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాలో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రలో నటిస్తుండగా, క్రేజీ బ్యూటీ వామిఖా గబ్బి హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.