
Vijay Deverakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘రౌడీ జనార్ధన్’ గురించి సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ తెగ హల్చల్ చేస్తోంది. ఈ సినిమాలో ఒక స్పెషల్ మాస్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండేను మేకర్స్ రంగంలోకి దించబోతున్నట్లు గట్టిగా టాక్ వినిపిస్తోంది. ఈ సాంగ్ కోసం చిత్ర యూనిట్ ఇప్పటికే అనన్యను సంప్రదించిందని, ఆమె కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఒకవేళ ఇదే గనుక నిజమైతే.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘లైగర్’ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ, అనన్యా పాండే జోడీ మరోసారి వెండితెరపై కనిపించనుంది.
నిజానికి ‘లైగర్’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించకపోయినప్పటికీ, విజయ్ – అనన్యల ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ, ప్రమోషన్స్ అప్పట్లో యూత్‌లో భారీ క్రేజ్ తీసుకొచ్చాయి. ఇప్పుడు మళ్లీ వీరు కలిసి నటిస్తున్నారనే వార్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. విజయ్ దేవరకొండకు బాక్సాఫీస్ వద్ద ఒక పవర్ఫుల్ కమ్‌బ్యాక్ మూవీగా ‘రౌడీ జనార్ధన్’ ఎంతో కీలకంగా మారింది. ఇలాంటి టైంలో అనన్యా పాండేను ఒక స్పెషల్ సాంగ్ కోసం తీసుకోవాలనే మేకర్స్ నిర్ణయం సినిమాపై మరింత హైప్ అండ్ క్యూరియాసిటీని పెంచుతుందా? లేక నెగటివ్ సెంటిమెంట్‌తో ట్రోలింగ్‌కు దారి తీస్తుందా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది. ఈ క్రేజీ అప్డేట్పై ‘రౌడీ జనార్ధన్’ టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.











