
Samyuktha Menon: రామ్ పోతినేని (RAPO) హీరోగా తెరకెక్కబోయే తాజా చిత్రం #RAPO23. తాజాగా ఈ చిత్రం గురించిన ఆసక్తికరమైన అప్‌డేట్ ఫిలిం నగర్ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం అవుతుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో టాలీవుడ్ లక్కీ చామ్ సంయుక్త మీనన్‌ను హీరోయిన్‌గా ఎంపికయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ‘భీమ్లా నాయక్’, ‘బింబిసార’, ‘సార్’, ‘విరూపాక్ష’ వంటి వరుస విజయాలతో టాలీవుడ్‌లో గోల్డెన్ లెగ్‌గా పేరు తెచ్చుకుంది సంయుక్త. వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ, గ్లామర్‌తోనూ ప్రేక్షకులను మెప్పిస్తున్న ఈ కేరళ కుట్టి, ప్రస్తుతం #RAPO23 చిత్రంలో ఫీమేల్ లీడ్‌గా పరిశీలనలో ఉన్నట్లు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ అవుతుంది. ఈ సినిమా కథకు ఆమె అయితేనే పక్కాగా సరిపోతుందని రామ్ భావిస్తున్నారట.
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు మంచి ప్రాధాన్యత ఉంటుంది. ఒకవేళ సంయుక్త ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, రామ్ – సంయుక్త కాంబినేషన్‌లో రాబోతున్న మొదటి సినిమా ఇదే అవుతుంది. ఈ సరికొత్త జోడీ వెండితెరపై సరికొత్త మ్యాజిక్ క్రియేట్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ అప్పుడే అంచనాలు వేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన చర్చలు ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉన్నాయని, త్వరలోనే సంయుక్త ఎంపికపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఇన్సైడ్ వర్గాల టాక్. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం, రామ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచేలా భారీ బడ్జెట్‌తో, పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ హీరోగా నటిస్తూనే డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ క్రేజీ అప్‌డేట్‌తో రామ్ అభిమానుల్లో సరికొత్త జోష్ నెలకొంది.










