
Rana Daggubati: టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి కొత్త సినిమా గురించి సోషల్ మీడియాలో ఆసక్తికరమైన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రశాంత్ వర్మ సినీమాటిక్ యూనివర్స్‌లో తెరకెక్కుతున్న ‘జై హనుమాన్’ చిత్రంలో రానా కీలక పాత్ర పోషించనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఆయన విలన్ రోలో రిషబ్ శెట్టిని ఢీ కొట్టబోతున్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన బయటికి రాలేదు.
‘హనుమాన్’ చిత్రానికి స్వికెల్‌గా తెరకెక్కుతున్న ఈ భారీ పాన్ ఇండియా మూవీలో రిషబ్ శెట్టి, తేజ సజ్జ ప్రధాన పాత్రలు పోషించనున్నట్లు ఇప్పటికే ప్రచారం సాగుతోంది. ఇప్పుడు వీరికి ఎదురుగా రానా విలన్‌గా నటించే అవకాశముందన్న వార్త ఈ సినిమాపై అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. గతంలో ‘బాహుబలి’లో భల్లాలదేవ పాత్రతో తన నటనకు ప్రశంసలు అందుకున్న రానా, మరోసారి పవర్‌ఫుల్ నెగటివ్ రోల్‌లో కనిపిస్తే సినిమా స్థాయి మరింత పెరుగుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కనున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రూపొందనున్నట్లు సమాచారం. ఈ సినిమాను 2027లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని టాక్ వినిపిస్తోంది. అయితే రానా పాత్ర, సినిమా విడుదల తేదీతో పాటు ఇతర వివరాలపై పూర్తి స్పష్టత రావాలంటే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.














