Dil Raju : ఫేక్ రివ్యూస్‌ కు చెక్.. మంచు విష్ణుని ఫాలో అవుతామంటున్న దిల్ రాజు


Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు తాజాగా నటుడు మంచు విష్ణు తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసించారు. కన్నప్ప సినిమా విడుదలకు ముందు మంచు విష్ణు ఫేక్ రివ్యూస్‌, నెగెటివ్ ట్రోలింగ్‌ను అరికట్టేందుకు సోషల్ మీడియా ద్వారా ఓ హెచ్చరిక నోటీస్‌ జారీ చేశారు. ఈ నోటీస్‌లో సినిమాను కావాలని టార్గెట్‌ చేస్తూ పరువుకు భంగం కలిగించేలా పోస్టులు పెడితే, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇది మంచి ఫలితాన్ని ఇచ్చింది. సినిమాకు విడుదల తర్వాత సోషల్ మీడియాలో ట్రోలింగ్ తక్కువగా కనిపించింది. ఫేక్‌ రివ్యూస్‌ మైనస్‌ కామెంట్స్‌ కూడా పెద్దగా కనిపించలేదు.

Also Read :  ఏప్రిల్ 3న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతున్న   తెలుగు–తమిళ  ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’...

ఇకపోతే దిల్ రాజు నిర్మించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ జూలై 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన మీడియాతో ముచ్చటిస్తూ.. నెగెటివ్ ట్రోలింగ్‌పై స్పందించారు. ‘కన్నప్ప’ చిత్రబృందం మంచి నిర్ణయం తీసుకుంది. సినిమా పరిరక్షణ కోసం మంచు విష్ణు తీసుకున్న చర్యలు పరిశ్రమకు ఉపయోగపడతాయని అభినందించారు. సినిమాను కాపాడాడానికి ఎవరు ఏ మంచి చేసినా.. మేమంతా అది ఫాలో అవుతామని అన్నారు. ట్రోలింగ్‌, ఫేక్‌ రివ్యూస్‌ వల్ల నిర్మాతలే ఎక్కువ నష్టపోతారు. సమీక్షలు రాసేముందు ఒక్కసారి ఆలోచించండి. రివ్యూస్‌ను ఆపమని కాదు కానీ అవి జన్యున్‌గా ఉండాలనీ, సినిమాకు హెల్ప్ చేయకపోయినా పర్లేదు.. డ్యామేజ్ మాత్రం చేయవద్దని విజ్ఞప్తి చేసారు.