
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – మలయాళ స్టార్ నటుడు ఫహాద్ ఫాసిల్ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులను అలరించబోతుందా.. ప్రస్తుతం సినీ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ‘పుష్ప’ సిరీస్‌లో ఈ ఇద్దరి మధ్య జరిగిన హై-వోల్టేజ్ స్క్రీన్ వార్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అదే కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుందనే వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం అల్లు అర్జున్, ఫహాద్ ఫాసిల్ మరోసారి కలిసి నటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
కథకు అత్యంత కీలకమైన పవర్ఫుల్ పాత్ర కోసం ఫహాద్ ఫాసిల్‌ను మేకర్స్ సంప్రదించినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన చర్చలు కూడా పాజిటీవ్‌గా సాగుతున్నాయని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ‘పుష్ప’లో భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో ఫహాద్ ఫాసిల్ తన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించగా, అల్లు అర్జున్‌తో ఆయన పోటీ సన్నివేశాలు సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. దీంతో ఈ ఇద్దరూ మరోసారి ఒకే వెండి తెరపై కనిపిస్తారనే ప్రచారం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే ఈ కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన దర్శకుడు, నిర్మాణ సంస్థ, కథ, ఇతర నటీనటుల వివరాలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన బయటికి రాలేదు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.












