AA24పై బిగ్ అప్‌డేట్.. బన్నీ కోసం ఆ స్టార్ డైరెక్టర్?

AA24

AA24: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన నటిస్తున్న భారీ చిత్రాలపై అభిమానుల్లో అంచనాలు కూడా భారీ ఉన్నాయి. ఇదే సమయంలో బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ప్రముఖ నటుడు, దర్శకుడు బాసిల్ జోసెఫ్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ 24వ చిత్రం చేయనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. #AA24 పేరుతో తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్, మరో అగ్ర నిర్మాణ సంస్థతో కలిసి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. బాసిల్ జోసెఫ్ వినూత్న స్టోరీలు , విభిన్నమైన మేకింగ్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నేపథ్యంలో, ఆయనతో అల్లు అర్జున్ కాంబినేషన్ సెట్ అయితే అది పాన్ ఇండియా స్థాయిలో మరో క్రేజీ ప్రాజెక్ట్‌గా నిలిచే అవకాశముందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్‌లో రాకా, లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు AA24పై వస్తున్న వార్తలు బన్నీ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. బాసిల్ జోసెఫ్ దర్శకత్వం, గీతా ఆర్ట్స్ నిర్మాణం, మరో ప్రముఖ నిర్మాణ సంస్థ భాగస్వామ్యం ఉంటే ఈ ప్రాజెక్ట్ మరింత భారీ స్థాయిలో రూపొందే అవకాశముందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ క్రేజీ కాంబినేషన్‌పై ఇప్పటివరకు అల్లు అర్జున్, బాసిల్ జోసెఫ్ లేదా గీతా ఆర్ట్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన బయటికి రాలేదు. దీంతో ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే చిత్రబృందం అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.