
Sambarala Yeti Gattu: టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం కెరీర్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చెన్నై లవ్ స్టోరీతో ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ యువ హీరో ఆ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన చేయాల్సిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘సంబరాల ఏటిగట్టు’ (Sambarala Yeti Gattu) నుంచి తప్పుకోవడానికి గల కారణాన్ని స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం ఈ భారీ ప్రాజెక్ట్ మెగా హీరో సాయి దుర్గా తేజ్ చేతుల్లోకి వెళ్లిన విషయం తెలిసిందే.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. దర్శకుడు రోహిత్ కేపీ చెప్పిన కథ తనకు ఎంతో నచ్చిందని తెలిపారు. కథలో ఉన్న కొత్తదనం, విజన్ తనను ఆకట్టుకున్నాయని చెప్పారు. అయితే ఈ కథను తెరపై ఆవిష్కరించేందుకు అవసరమైన బడ్జెట్ తన ప్రస్తుత మార్కెట్ స్థాయికి మించి ఉందని భావించి, పెద్ద రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక ఆ సినిమా నుంచి తప్పుకున్నట్లు వెల్లడించారు. మొదట ఈ చిత్రాన్ని సుమారు రూ.60-70 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించాలని అనుకున్నప్పటికీ, కథ పరిధి, భారీ విజువల్స్, నిర్మాణ ప్రమాణాలు పెరగడంతో బడ్జెట్ మరింత పెరిగినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా బడ్జెట్ రూ.100 కోట్లకు పైగా చేరినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే సినిమా నుంచి తప్పుకున్నప్పటికీ ‘సంబరాల ఏటిగట్టు’పై తనకు పూర్తి నమ్మకం ఉందని కిరణ్ తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌లో సాయి దుర్గా తేజ్ నటిస్తున్నందుకు సంతోషంగా ఉందని, సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు. ఇక భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సాయి దుర్గా తేజ్ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలవనుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. కిరణ్ అబ్బవరం నిర్ణయం, సాయి ధరమ్ తేజ్ ఎంట్రీతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.














