
Special Song: న్యాచురల్ స్టార్ నాని హీరోగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ చిత్రంపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, తాజాగా మరో ఆసక్తికర వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో ఉండే స్పెషల్ సాంగ్ కోసం స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. చిత్ర బృందానికి సన్నిహిత వర్గాల సమాచారం మేరకు.. ప్రస్తుతం ఈ స్పెషల్ నంబర్‌కు కీర్తి సురేష్‌నే తొలి ఎంపికగా భావిస్తున్నారని, ఆమె నటించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.
ఈ వార్త నిజమైతే, నాని-కీర్తి సురేష్ కాంబినేషన్లో ఇది మూడో సినిమా కానుంది. గతంలో వీరిద్దరి జోడీ ప్రేక్షకులను ఆకట్టుకోగా, ఇప్పుడు మరోసారి స్క్రీన్‌ను షేర్ చేసుకునే అవకాశంపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేకాదు, దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో కీర్తి సురేష్‌కు ఇది రెండో సినిమా కానుండటం కూడా విశేషం. ‘ది ప్యారడైజ్’ను మేకర్స్ భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా స్పెషల్ సాంగ్‌ను కూడా సినిమాకు హైలైట్‌గా నిలిచేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే కీర్తి సురేష్ స్పెషల్ సాంగ్‌లో నటించనున్నారనే విషయంపై చిత్ర బృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.













