
Suriya47: తమిళ స్టార్ హీరో సూర్య వరుస సినిమాలతో అభిమానులను అలరించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ‘కరుప్పు’తో ప్రేక్షకుల ముందుకు వచ్చి అదిరిపోయే సక్సెస్‌ను సొంతం చేసకున్న ఆయన, ప్రస్తుతం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’తో మరోసారి మ్యాజిక్ చేయడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే సూర్య తన నెక్ట్స్ చిత్రం ‘సూర్య47’ రిలీజ్‌పై కూడా అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది.
తాజా సమాచారం ప్రకారం.. ‘సూర్య47’ చిత్రాన్ని 2026 దీపావళి కానుకగా థియేటర్లలో రిలీజ్ చేయాలని మేకర్స్ టార్గెట్‌గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన బయటికి రాలేదు. ఒకవేళ ఈ వార్తలు నిజమైతే, ‘కరుప్పు’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తర్వాత వరుసగా థియేటర్లలో విడుదలయ్యే సూర్య మూడో చిత్రంగా ‘సూర్య47’ నిలవనుంది. దీంతో సూర్య అభిమానుల్లో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింత పెరిగాయి. ఇటీవలి కాలంలో విభిన్న కథలను ఎంచుకుంటూ తన సినిమాలతో కొత్త ప్రయోగాలు చేస్తున్న సూర్య, ‘సూర్య47’తో కూడా మరో ప్రత్యేకమైన కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.













