Vijay Deverakonda: విజయ్ వదిలేసిన కథతో లోకేష్ హిట్ కొట్టాడా? ‘డీసీ’పై ఆసక్తికర చర్చ!

Vijay Deverakonda

Vijay Deverakonda: తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా నటించిన తాజా రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామా ‘డీసీ’. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. ‘సానికాయిదం’, ‘కెప్టెన్ మిల్లర్’ ఫేమ్ అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 7న తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన తర్వాత సినిమాకు మంచి మౌత్ టాక్ రావడంతో పాటు రెండో రోజు కూడా తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో బలమైన వసూళ్లు నమోదవుతున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇదిలా ఉండగా.. ‘డీసీ’ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో హీరో పాత్ర కోసం మొదట టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండను డైరెక్టర్ అరుణ్ మాథేశ్వరన్ సంప్రదించినట్లు ప్రచారం జరుగుతోంది. విజయ్‌కు ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆయన ఈ సినిమాను చేయలేదని టాక్. ప్రస్తుతం ‘డీసీ’ మంచి రెస్పాన్స్ అందుకుంటుండటంతో.. గతంలో విజయ్ దేవరకొండ చేసిన ఓ పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను షేర్ చేస్తూ నెటిజన్లు ‘ఈ సినిమాను విజయ్ చేసి ఉంటే ఎలా ఉండేది?’ అంటూ ఆసక్తికరమైన చర్చలు చేస్తున్నారు.

ఇక ‘డీసీ’లో లోకేష్ కనగరాజ్ నటనకు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. తొలిసారి హీరోగా ఆయన చేసిన ప్రయత్నం సర్‌ప్రైజింగ్ సక్సెస్‌గా మారుతోందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచిందని టాక్. ఇంటర్వెల్ యాక్షన్ బ్లాక్‌లో అనిరుధ్ BGM థియేటర్లలో గూస్‌బంప్స్ తెప్పిస్తోందని ప్రేక్షకులు చెబుతున్నారు. ‘డీసీ’కి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్‌తో చిత్రబృందం ఫుల్ జోష్‌లో ఉంది.