
Toxic: రాకింగ్ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘టాక్సిక్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో అనుకోని ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమంలో భారీ సౌండ్ బాక్స్ సెటప్ ఒక్కసారిగా కూలిపోవడంతో ఇద్దరు విద్యార్థులు గాయపడినట్లు సమాచారం. ఈవెంట్ సందర్భంగా పెద్ద సంఖ్యలో అభిమానులు, విద్యార్థులు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలో వేదికకు సమీపంలో ఏర్పాటు చేసిన భారీ సౌండ్ సిస్టమ్ ఒక్కసారిగా కూలిపోయినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడున్న వారిలో ఒక్కసారిగా భయాందోళన నెలకొంది.
ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. గాయపడిన వారిలో ఓ యువతి ప్రమాదం జరిగిన వెంటనే స్పృహ కోల్పోయినట్లు తెలుస్తోంది. ఘటనను గమనించిన పోలీసులు, నిర్వాహకులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. సౌండ్ సెటప్‌ను ఏర్పాటు చేసిన విధానం, భద్రతా చర్యలు పాటించారా లేదా అనే అంశాలపై అధికారులు వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఇదిలా ఉండగా, యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ప్రమాదం చోటుచేసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.














