
Taapsee: వ్యక్తిగత జీవితాన్ని అత్యంత సీక్రెట్‌గా ఉంచే బాలీవుడ్ బోల్డ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ తాప్సీ పన్ను తన సీక్రెట్ లవ్ స్టోరీపై ఎట్టకేలకు మనసు విప్పారు. బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తొలి రోజుల్లోనే ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ మథియాస్ బోతో ప్రేమాయణం మొదలైందని వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. తన 13 ఏళ్ల బంధం, పెళ్లి వెనుక ఉన్న అసలు నిజాన్ని బయటపెడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం బీ-టౌన్లో వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేవుడు పుట్టుకతోనే ఒక కుటుంబాన్ని ఇస్తాడు. నా సినీ కెరీర్ కూడా అనుకోకుండానే నా జీవితంలోకి వచ్చింది. కానీ నా జీవిత భాగస్వామిగా మథియాస్ బోను ఎంచుకోవడం మాత్రం నూటికి నూరు శాతం నా ఛాయిస్. నా లైఫ్‌లో నేను తీసుకున్న అత్యుత్తమ నిర్ణయం ఏదైనా ఉందంటే అది మథియాస్‌ను ప్రేమించడమే. అందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను అంటూ ఆనందం వ్యక్తం చేశారు. లాస్ట్ ఈయర్ అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్న తాప్సీ.. తమ 13 ఏళ్ల అనుబంధం ఇంత పటిష్టంగా కొనసాగడానికి అసలు కారణాన్ని విశ్లేషించారు. “చాలామంది కేవలం ప్రేమతోనే బంధం నిలబడుతుందని అనుకుంటారు. కానీ మా ఇద్దరి మధ్య ప్రేమ కంటే ఎక్కువగా ఒకరిపై ఒకరికి అపారమైన గౌరవం ఉంది. అదే మా బంధానికి అసలైన పునాది. ఆ పరస్పర గౌరవం, భద్రతా భావమే మమ్మల్ని ఇన్నేళ్లుగా ఒక్కటిగా నిలబెట్టాయి. గౌరవం లేని బంధం ఎక్కువ కాలం మనుగడ సాగించలేదు” అని తాప్సీ స్పష్టం చేశారు.
తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన తాప్సీ చిత్రం ‘గాంధారి’ ఓటీటీ వేదికగా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. కేవలం మూడు వారాల వ్యవధిలోనే 18.9 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుని సరికొత్త రికార్డులను తిరగరాసింది. ఈ గ్రాండ్ సక్సెస్ ఊపులో ఉండగానే, తాప్సీని ప్రతిష్టాత్మక ‘హార్పర్స్ బజార్ ఇండియా ఉమెన్ ఆఫ్ ది ఇయర్ – 2026’ పురస్కారం వరించింది. ఈ వేదికపై అవార్డు అందుకున్న అనంతరం ఆమె భావోద్వేగంగా స్పందిస్తూ.. “ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్, ప్రణాళికలు లేకుండానే నా కెరీర్ స్టార్ట్ అయ్యింది. తోటి నటీమణులు ఇచ్చే హెల్తీ కాంపిటీషన్ వల్లే నన్ను నేను నిరంతరం మెరుగుపరుచుకోగలుగుతున్నాను. సినీ పరిశ్రమలో గుర్తింపు కోసం, వైవిధ్యమైన పాత్రల కోసం నిరంతరం శ్రమిస్తున్న ప్రతి మహిళకూ ఈ అవార్డును అంకితం చేస్తున్నాను” అని పేర్కొన్నారు. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా తాప్సీ తన మార్కును స్పష్టంగా చాటుకుంటూ ముందుకు సాగుతున్న తీరు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.













