King 100: దసరాకు ‘కింగ్ 100’ నుంచి వచ్చే బిగ్ సర్‌ప్రైజ్ ఇదేనా?

King

King 100: కింగ్ అక్కినేని నాగార్జున కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘కింగ్ 100’. హీరోగా నాగార్జున మైలురాయి 100వ చిత్రంగా రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై టాలీవుడ్‌లో ఇప్పటికే మామూలు అంచనాలు లేవు. రా కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి దసరా పండుగ కానుకగా అదిరిపోయే సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్‌లో తీవ్ర సంచలనంగా మారింది. ఈ సినిమాలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. నాగార్జున, వెటరన్ హీరోయిన్ టబు చాలా ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలు వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి క్రేజీ కాంబో మళ్లీ నాగ్ 100వ సినిమాలో రిపీట్ అవుతుండటంతో టబు పాత్ర ఎలా ఉండబోతోందన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది.

తాజా సమాచారం ప్రకారం.. దసరా సందర్భంగా టబు పాత్రకు సంబంధించిన ప్రత్యేక గ్లింప్స్‌ను విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నాగార్జునతో పాటు ఆమె క్యారెక్టర్ లుక్, రోల్ నేచర్‌ను పరిచయం చేస్తూ ఇచ్చే ఈ అప్‌డేట్ సినిమాపై హైప్‌ను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. నాగార్జున కెరీర్‌లో వందో సినిమా కావడంతో ప్రతి అప్‌డేట్‌ను ఎంతో జాగ్రత్తగా, ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అయితే, దసరాకు టబు గ్లింప్స్ విడుదలవుతుందన్న వార్తలపై నిర్మాణ సంస్థ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. పండుగ వేళ నిజంగానే ఈ అదిరిపోయే గిఫ్ట్ రానుందా లేక మరికొన్ని రోజులు ఆగాల్సి ఉంటుందా అన్నది తెలియాలంటే చిత్ర యూనిట్ నుంచి క్లారిటీ వచ్చే వరకు వేచి చూడాలి. ఏదేమైనా నాగ్-టబు జోడీ మళ్లీ తెరపైకి రాబోతోందన్న ఒక్క వార్తే అక్కినేని అభిమానుల్లో పండుగ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తోంది.