అంగన్‌వాడీలపై సీఎం జగన్ సమీక్ష


మహిళా, శిశు సంక్షేమశాఖ, సంక్షేమ హాస్టళ్లపై సీఎం వైఎస్.జగన్‌ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గతంలో ఇచ్చిన సీఎం ఆదేశాల అమలు ప్రగతిని సీఎం వైఎస్.జగన్‌ కి అధికారులు వివరించారు.

అంగన్‌వాడీలలో సూపర్‌ వైజర్ల పోస్టులను భర్తీచేశామని అధికారులు తెలియజేశారు.

Also Read :  Pawan Kalyan: 'మీ అయ్య జాగీరా తెలంగాణ.. మీరెవరు నన్ను బెదిరించడానికి' : పవన్ కళ్యాణ్

అంగన్వాడీలలో పాల సరఫరాపై నిరంతర పర్యవేక్షణ, వాటి ఫలితాలను వివరించిన అధికారులు.

అక్టోబరు నెలలో నూటికి నూటికి నూరుశాతం పంపిణీ జరిగిందన్న అధికారులు.

డిసెంబర్‌1 నుంచి ఫ్లేవర్డ్‌ మిల్క్‌ను అంగన్వాడీల్లో అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు.

పైలెట్‌ ప్రాజెక్టు కింద ముందుగా కొన్ని అంగన్‌వాడీల్లో అమలు చేస్తామన్న అధికారులు.

Also Read :  Pawan Kalyan: 'మీ అయ్య జాగీరా తెలంగాణ.. మీరెవరు నన్ను బెదిరించడానికి' : పవన్ కళ్యాణ్

మూడు నెలల్లోగా రాష్ట్రంలోని అన్ని అంగన్‌వాడీలలో సరఫరా చేయడానికి చర్యలు తీసుకోవాలన్న సీఎం వైఎస్ జగన్