టెక్నోపెయింట్స్ నూతన ప్రచారకర్త గా గాడ్ అఫ్ క్రికెట్ ‘సచిన్ టెండూల్కర్’

Techno paints brand ambassa
దేశవ్యాప్తంగా విశ్వసనీయతకు ప్రతీకగా నిలుస్తున్న టెక్నో పెయింట్స్ మరో వినూత్న ప్రకటనను రూపొందించింది. భారత క్రికెట్‌కు చిరస్థాయి ప్రతిష్టను తెచ్చిన గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ ని తమ బ్రాండ్ అంబాసడర్‌గా నియమించి, పవన్ కళ్యాణ్‌తో ‘OG’ చిత్రాన్ని తెరకెక్కించిన సుజీత్ దర్శకత్వంలో రెండు గ్రాండ్ యాడ్ ఫిల్మ్స్‌ను ముంబైలో నిర్మించారు. రంగులు కేవలం గోడలపై మాత్రమే కాకుండా మన హృదయాల్లోనూ కళాత్మక భావాలను ప్రతిబింబిస్తాయనే కాన్సెప్ట్‌తో రూపొందించిన ఈ ప్రకటనలను ది ఒరిజినల్స్ సంస్థ నిర్మించగా, ప్రమోషనల్ ఈవెంట్స్‌లో అగ్రగామిగా ఉన్న శ్రేయస్ మీడియా సంస్థ advertising డివిజన్ Brande Agency కోఆర్డినేటర్‌గా వ్యవహరించింది. ఈ యాడ్ చిత్రీకరణ విజయవంతంగా పూర్తయి, త్వరలోనే అన్ని మీడియా ప్లాట్‌ఫార్మ్‌లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read :  OYO IPO: మారబోతున్న ఓయో జాతకం.. ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్! మార్కెట్లో ‘ప్రిజమ్’ సంచలనం ..

ఈ సందర్భంగా టెక్నో పెయింట్స్ ఎండీ శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ, “భారతదేశంలో చిత్రకళా భావనను, రంగుల సంస్కృతిని కొత్త కోణంలో పరిచయం చేయాలనే మా సంకల్పానికి శ్రీ సచిన్ టెండూల్కర్ గారిలాంటి ప్రతిష్టాత్మక వ్యక్తితో భాగస్వామ్యం కావడం మాకు గర్వకారణం. అలాగే ‘OG’ చిత్ర దర్శకుడు సుజీత్ ఈ యాడ్‌ను అద్భుతంగా తీర్చిదిద్దారు” అని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో విశ్వసనీయతను సంపాదించిన టెక్నో పెయింట్స్ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. రిటైల్ రంగంలో కొత్త భాగస్వామ్యాలతో కలిసి ఫ్రాంచైజీలను అన్ని రాష్ట్రాల్లో నెలకొల్పే క్రమంలో ఈ కొత్త బ్రాండ్ క్యాంపెయిన్‌ను రూపొందించిందని, దేశంలోని అన్ని మీడియా వేదికల ద్వారా ఈ ప్రకటనలను త్వరలోనే విడుదల చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.