Meesala Pilla : 36 మిలియన్ వ్యూస్ దాటిన చిరంజీవి ‘మీసాల పిల్ల’ – యూట్యూబ్‌లో సెన్సేషన్!

Msg
Meesala Pilla : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రంలోని తొలి సింగిల్ ‘మీసాల పిల్ల’ ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ఈ ఎనర్జిటిక్ మెలోడీ ఇన్‌స్టంట్ చార్ట్‌బస్టర్‌గా మారి, తెలుగు పాటకు జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపును తెచ్చిపెట్టింది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ‘మీసాల పిల్ల’ యూట్యూబ్ మ్యూజిక్ ఇండియాలో నంబర్ 1 స్థానానికి చేరుకుని, వరుసగా 13 రోజులు అగ్రస్థానాన్ని కొనసాగిస్తూ 36 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది.

Also Read :  రివ్యూ : విష్ణు విన్యాసం

ఇక చిరంజీవి గారి టైమ్‌లెస్ చార్మ్, ఎనర్జిటిక్ డాన్స్ మూవ్స్, హ్యూమర్, నయనతారతో ఉన్న కెమిస్ట్రీ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉదిత్ నారాయణ్, శ్వేతా మోహన్ గాత్రాలు పాటకు నాస్టాల్జిక్ టచ్ ఇవ్వగా, భీమ్స్ సమకూర్చిన బీట్‌లు ఎనర్జీని రెట్టింపు చేశాయి. ఈ పాటలోని క్యాచీ హుక్ స్టెప్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, అభిమానులు పెద్ద ఎత్తున రీ-క్రియేట్ చేస్తున్నారు.

Also Read :  Hansi Productions బ్యానర్‌పై యూత్‌ఫుల్ లవ్ డ్రామా ప్రారంభం

పండుగ వాతావరణంలో కుటుంబ భావోద్వేగాలు, వినోదంతో నిండిన ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో విక్టరీ వెంకటేశ్ కీలక పాత్రలో కనిపించనుండటం సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. సాహూ గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్‌ కానుంది.