భోళా శంకర్ టీజర్.. ఫ్యాన్స్ కి పూనకాలే..!


మెగాస్టార్ చిరంజీవి హీరోగా తమన్నా హీరోయిన్ గా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ భోళా శంకర్. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులలో బిజీగా ఉంది. కాగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితం అవుతున్న భోళా శంకర్ ఫస్ట్ లుక్ టీజర్ ని నేడు గ్రాండ్ గా విడుదల చేసారు చిత్రయూనిట్.

Also Read :  Megastar Chiranjeevi Honoured With The NTR National Film Award In Gaddar Awards 2025

33 మందిని దారుణంగా చంపిన వ్యక్తి కోసం కోల్‌కతా పోలీసులు వెతుకుతున్నారని చెప్పే వాయిస్‌ ఓవర్‌ తో టీజర్ ప్రారంభమవుతుంది. చిరంజీవి ఇంట్రడక్షన్ సీక్వెన్స్‌ లో తన స్వాగ్, స్టయిల్ తో అదరగొట్టారు. డెన్‌లో గూండాలను చితకొట్టి “షికార్ కొచ్చిన షేర్ ని బే.. ” అని చెప్పిన డైలాగ్ పవర్ ఫుల్ గా పేలింది. “ఈ స్టేట్ డివైడ్ అయినా అందరూ నా వాళ్లే.. అన్ని ఏరియాలు అప్నా హై.. నాకు హద్దుల్లేవ్.. సరిహద్దుల్లేవ్.. 11 ఆగస్ట్ దేఖ్‌లేంగే.. ” అంటూ మెగాస్టార్‌ డైలాగ్స్‌ అదరగొట్టేశాడు. ప్రస్తుతం భోళా శంకర్ టీజర్ మెగా ఫ్యాన్స్ ని, ఆడియన్స్ ని అలరిస్తూ దూసుకుపోతోంది. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ సోదరిగా కీర్తి సురేష్ నటిస్తుండగా మహతి స్వరసాగర్ సంగీతం అందించారు.

Also Read :  రివ్యూ : విష్ణు విన్యాసం