దర్శకుడి బండారం బయపెట్టిన గోట్ హీరోయిన్

Divayవిశ్వక్సేన్ నటించిన పాగల్ సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు నరేష్. ఆ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. ఆ తర్వాత సుడిగాలి సుదీర్ హీరోగా గోట్ అనే సినిమాను అనౌన్స్ చేశాడు దర్శకుడు అయితే కొన్ని కారణాల వలన ఆ సినిమా నుంచి దర్శకుడుని తప్పించారు. నిర్మాత ఆ సినిమాకి దర్శకుడుగా మారాడు.

తాజాగా నరేష్ పైన ఆ సినిమాలో నటిస్తున్న దివ్యభారతి ట్విట్టర్ వేదికగా సంచలన కామెంట్ చేశారు. ”ఏమి లేబర్ రా నువ్వు, ఎడిట్ లో తీసి పడేసిన షాట్స్ తో నెక్స్ట్ సినిమా అంతా కాలం గడిపేలా ఉన్నావు. అసలు సెకండ్ లీడ్ యాక్టర్స్ చేయాల్సింది, ఈ చిలకతో వదిలావు. పోనీ మంచి ట్యూన్ ఏం చేసావురా? స్టెప్పం కొట్టి డప్పం వేయనా? ఈ ఒక్క పాటతో రెండు చేతులు గుండెపై పెట్టుకొని.. అంటూ నరేష్ ఓ ట్వీట్ పెట్టాడు.

Also Read :  రైతుబంధు ఎక్కడ? కాంగ్రెస్ మాట తప్పిందంటూ హరీష్ రావు ఫైర్..

ఈ ట్వీట్ ను రీ ట్వీట్ చేస్తూ దివ్యభారతి దర్శకుడు నరేష్ పైన సంచలన ఆరోపణలు చేసింది. స్త్రీలను “చిలకా” లేదా మరేదైనా పదం అని పిలవడం జోక్ కాదు, ఇది లోతుగా పాతుకుపోయిన స్త్రీ ద్వేషాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ దర్శకుడు సెట్‌లో కూడా అదే పద్ధతిని అనుసరించాడు, పదే పదే మహిళలను అగౌరవపరుస్తూ కళకే ద్రోహం చేశాడు” అంటూ దివ్యభారతి ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. దీంతో ఇప్పుడీ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Also Read :  ఏప్రిల్ 3న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతున్న   తెలుగు–తమిళ  ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’...

సుధీర్ హీరో గా నటిస్తున్న గోట్ సినిమాని మధ్యలో వదిలేశాడు నరేష్. తన వైఖరీ వలనే ప్రాజెక్ట్ నుంచి బయటికి రావాల్సివచిందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు స్వయంగా హీరోయిన్ ఆరోపణలు చేయడం మరింత సంచలనంగా మారింది.