ENE Repeat: ‘ఈ నగరానికి ఏమైంది-2’ రిలీజ్ డేట్ ఫిక్స్! ఎప్పుడో తెలుసా?

Ee Nagaraniki Emaindi

ENE Repeat: తెలుగు చిత్ర పరిశ్రమలో యూత్‌ఫుల్, ఫ్రెండ్‌షిప్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చి కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది’ (Ee Nagaraniki Emaindi). సరిగ్గా ఈ చిత్రం విడుదలై 8 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని, చిత్రబృందం తాజాగా ఈ క్రేజీ మూవీ సీక్వెల్‌కు సంబంధించిన అదిరిపోయే అప్‌డేట్‌ను అధికారికంగా ప్రకటించింది. ‘ఈఎన్ఈ రిపీట్’ (ENE Repeat) పేరుతో తెరకెక్కుతున్న ఈ మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ తాజాగా లాక్ చేశారు.

ఈ నగరానికి ఏమైంది చిత్రంతో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన సెన్సేషనల్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్, ఈ సీక్వెల్‌ను కూడా తనదైన మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో రూపొందిస్తున్నారు. ఈ క్రేజీ సీక్వెల్ మూవీని ఈ ఏడాది నవంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అత్యంత గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఈ మేరకు విడుదల చేసిన చిన్న గ్లింప్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఫస్ట్ పార్ట్‌లో ‘కార్తీక్’ పాత్ర పోషించిన సాయి సుశాంత్ వ్యక్తిగత కారణాల వల్ల ఈ సీక్వెల్‌కు దూరం అవ్వగా, ఆయన స్థానంలో టాలెంటెడ్ నటుడు శ్రీనాథ్ మాగంటి ఈ గ్యాంగ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక మిగిలిన ముగ్గురు దోస్తులుగా మాస్ కా దాస్ విశ్వక్‌సేన్, అభినవ్ గోమఠం, వెంకటేశ్ కాకుమాను ఈ పార్ట్‌లోనూ తమదైన వన్-లైనర్స్‌తో నవ్వించడానికి రెడీ అయ్యారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ ఒరిజినల్స్, రూట్‌నోడ్ సినిమా బ్యానర్లపై సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈసారి గోవా ట్రిప్ కాకుండా థాయిలాండ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సరికొత్త క్రేజీ జర్నీతో ఈ సీక్వెల్ ఉండబోతుందని సమాచారం.