Soothravakyam : ఓటీటీలో దూసుకుపోతున్న ‘సూత్రవాక్యం’.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ దాటి..!

Soothravakyam
Soothravakyam : మలయాళం నుంచి వచ్చిన ‘సూత్రవాక్యం’ సినిమా ఓటీటీలో దూసుకుపోతోంది. షైన్ టామ్ చాకో, విన్సీ ఆలోషియస్, దీపక్ పరంబోల్, శ్రీకాంత్ కాండ్రేగుల ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి యూజియన్ జోస్ చిరామ్మెల్ దర్శకత్వం వహించారు. థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ప్రైమ్ వీడియోలో 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ దాటినట్లు చిత్ర బృందం ప్రకటించడంతో అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ముఖ్యంగా నటుడు షైన్ టామ్ చాకోతో పాటు టాలీవుడ్ నిర్మాత శ్రీకాంత్ కాండ్రేగుల నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Also Read :  Rakasa : నవ్విస్తూనే భయపెడుతున్న నిహారిక 'రాకాస' టీజర్

సినిమా కథలో క్రిస్టో జేవియర్ (షైన్ టామ్ చాకో) అనే పోలీస్ ఆఫీసర్, తన డ్యూటీతో పాటు గ్రామంలోని పేద పిల్లలకు పాఠాలు చెబుతుంటాడు. అయితే అతడి ట్యూషన్స్‌ వల్ల పిల్లలు స్కూల్ మానేస్తున్నారని టీచర్ నిమిషా (విన్సీ) ఫిర్యాదు చేస్తుంది. ఇదే సమయంలో క్రిస్టో ట్యూషన్‌కు వచ్చే అమ్మాయి ఆర్య, ఆమె అన్న వివేక్, ఆమె ప్రియుడు అఖిల్ మధ్య తలెత్తిన విభేదాల కారణంగా ఊహించని సంఘటనలు చోటుచేసుకుంటాయి. వివేక్ అదృశ్యం కావడంతో పాటు ఒక హత్య కేసు వెలుగులోకి వస్తుంది. ఈ మిస్సింగ్, మర్డర్ కేసులను క్రిస్టో ఎలా ఛేదించాడు, చివరికి అసలు నిందితుడు ఎవరు అన్నదే ఈ సినిమా ప్రధాన ఆసక్తికర అంశం.