పాపం .. మంచు బ్రదర్స్ పరువు రోడ్డుకెక్కింది

మంచు వారింట్లో అన్నదమ్ముల మధ్య గొడవలు వున్నాయని చాలా కాలంగా వినిపిస్తోంది. ఇప్పుడు అన్నదమ్ముల గొడవలు బయటికి వచ్చాయి. విష్ణు తీరుపై మండిపడుతూ మనోజ్ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడం కలకలం రేపంది.

తన అనుచరుడు ఇంటికి వెళ్లి అతడిపై విష్ణు దాడి చేశాడని, ఇలాగే బంధువుల ఇళ్లల్లో దాడులు చేస్తాడని మనోజ్ ఈ వీడియోలో చెప్పాడు. మంచు విష్ణును ఇద్దరు వ్యక్తులు ఆపుతుండగా.. ఒరేయ్ అరేయ్ అని ఏదో అంటున్నాడు కదా? అంటూ విష్ణు అడగడం కనిపిస్తోంది. ఇదిగో అండి ఇలా ఇంటి మీదకు వచ్చి అందరినీ కొడుతుంటాడు అంటూ వాయిస్ వినిపించింది.

Also Read :  Megastar Chiranjeevi Honoured With The NTR National Film Award In Gaddar Awards 2025

నిజానికి మనోజ్ పెళ్లి విష్ణు కి ఇష్టం లేదని వినిపించింది. ఇటీవల జరిగిన మనోజ్, భూమా మౌనికల పెళ్లిలో విష్ణు పెద్దగా కనిపించలేదు. ఇప్పుడు వారి గొడవలు బట్ట బయలు అయ్యాయి. ఈ వీడియో విష్ణు ని చాలా నెగిటివ్ షేడ్స్ లో చూపించింది. విష్ణు నటుడే కాదు మా ప్రెసిడెంట్ కూడా. మరి దీనిపై ఎలా వివరణ ఇస్తాడో చూడాలి.