Manju Warrier : మలయాళ సినీ ప్రపంచంలో హీరోయిన్ మంజు వారియర్ పేరు అందరికీ సుపరిచితం. అయితే ఆమె కెరీర్ ప్రారంభ దశలో జరిగిన ఒక సంఘటన ఇప్పటికీ చర్చనీయాంశంగా ఉంది. ‘సల్లాపం’ సినిమా షూటింగ్ సమయంలో మంజు వారియర్ ప్రాణాపాయం నుండి ఎలా బయటపడ్డారో, తన చేతిలోనే ఆమెను రక్షించానని సహనటుడు మనోజ్ కె. జయన్ తాజాగా వెల్లడించారు.
ఆయన చెప్పిన ప్రకారం, ఆ సినిమాలో ఒక సన్నివేశంలో మంజు వారియర్ రైల్వే ట్రాక్‌పై నిలబడి నటించాల్సి వచ్చింది. షూటింగ్ జరుగుతున్న సమయంలో ట్రైన్ వేగంగా వస్తుండగా, ఆమె పాత్రలో మునిగిపోయి వెనక్కి కదలకపోవడం గమనించిన మనోజ్ జయన్ వెంటనే స్పందించారు. “ఆ క్షణం నేను ఒక్క సెకను ఆలస్యంగా పట్టుకుంటే మంజు వారియర్ ప్రాణాలు పోయేవి. నా చేతి పట్టు కొంచెం సడలినా ఈరోజు మంజు వారియర్ మనతో ఉండేది కాదు” అని ఆయన ఆ సంఘటనను గుర్తుచేసుకున్నారు.
ఆ క్షణం షూటింగ్ యూనిట్ మొత్తం షాక్‌కు గురైంది. మంజు వారియర్ మాత్రం షాక్‌లోనుండి బయటికి వచ్చాక మనోజ్ జయన్‌కి ప్రాణరక్షకుడిలా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంఘటన తర్వాత మంజు వారియర్ మలయాళ చిత్రసీమలో తన స్థానాన్ని బలపరచి, స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు.











