
భారీ అంచనాల నడుమ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సంక్రాంతి కానుకగా జనవరి 12, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది. హిట్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు ఇంకా 20 రోజులు మాత్రమే మిగిలి ఉండగా, మేకర్స్ తాజాగా విడుదల చేసిన కౌంట్‌డౌన్ పోస్టర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గరపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీమతి ఆర్చనా ప్రెజెంట్ చేస్తున్నారు. కొత్త పోస్టర్‌లో బ్లాక్ సూట్, వైట్ షర్ట్‌లో స్టైలిష్‌గా కనిపించిన చిరంజీవి, డార్క్ గ్లాసెస్‌తో పాటు పిస్టల్ పట్టుకుని లగ్జరీ బంగ్లాలో కూర్చుని ఉన్న తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది.
ఇక అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూడో సింగిల్ ప్రకటన త్వరలోనే రానుంది. ముఖ్యంగా ఈ పాటలో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలిసి స్టెప్పులు వేయనున్నారని సమాచారం ఉండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం సినిమా డబ్బింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మాస్ ఎలిమెంట్స్‌తో పాటు వినోదం, యాక్షన్‌ను మేళవించిన పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా ‘మన శంకర వర ప్రసాద్ గారు’ని అనిల్ రావిపూడి తెరకెక్కిస్తుండగా, ప్రమోషన్స్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.










