ఎన్టీఆర్ 30 ముహూర్తం ఫిక్స్..


నందమూరి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. తాజాగా ఎన్టీఆర్ 30 ముహూర్తం ఫిక్స్ చేసేశారు. ఎన్టీఆర్ 30వ చిత్రానికి మార్చి 23న ముహూర్తం ఫిక్స్ చేసినట్టు సాలిడ్ పోస్టర్‌తో అనౌన్స్ చేశారు. ఈ పోస్టర్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. దీంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అంతేకాదు కొరటాల – ఎన్టీఆర్ కాంబోలో మరోసారి రికార్డు బద్దలయ్యే చిత్రం రావాలంటూ ఫ్యాన్స్ కోరుతున్నారు.

Also Read :  Megastar Chiranjeevi Honoured With The NTR National Film Award In Gaddar Awards 2025

ఇక ఈ చిత్రంలో అతిలోక సుందరి, దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తారక్ సరసన నటించబోతున్నట్టు ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఇక ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుధాకర్ మిక్కిలినేని, కోసరాజు హరికృష్ణ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది 2024 ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.