NTR : ముగిసిన వార్-2 షూటింగ్.. హృతిక్ రోషన్ పై తారక్ ఆసక్తికర వ్యాఖ్యలు

 

NTR : టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్గా గుర్తింపు పొందిన హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘వార్ 2’ పై ఆసక్తి తారాస్థాయికి చేరింది. ఈ మల్టీ స్టారర్ యాక్షన్ థ్రిల్లర్ కు సంబంధించిన తాజా అప్డేట్‌ను ఎన్టీఆర్ స్వయంగా వెల్లడించారు. ఈ చిత్రంలో తన పాత్ర చిత్రీకరణ పూర్తి చేసినట్లు ఎన్టీఆర్ సోమవారం సోషల్ మీడియా వేదికగా అధికారికంగా తెలిపారు.

ఈ సందర్భంగా తన అనుభవాలను పంచుకుంటూ ఎన్టీఆర్, సహ నటుడు హృతిక్ రోషన్ పై ప్రశంసలు కురిపించారు. “హృతిక్ రోషన్ సర్‌తో కలిసి పనిచేయడం ఒక గొప్ప అనుభవం. ఆయన ఎనర్జీ, డెడికేషన్ నాకు ఎప్పటికీ ఇన్‌స్పిరేషన్. ఈ సినిమా సెట్ లో ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను” అని ఎన్టీఆర్ పేర్కొన్నారు.

Also Read :  Sampradayini Suppini Suddapoosani : ఆసక్తికరంగా 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' ట్రైలర్

దర్శకుడు అయాన్ ముఖర్జీ ఎంతో గొప్ప విజన్‌తో ఈ ప్రాజెక్ట్‌ను నడిపిస్తున్నారని, ఇది ప్రేక్షకులకు ఒక భారీ విజువల్ ట్రీట్ అవుతుందని ఎన్టీఆర్ అభిప్రాయపడ్డారు. నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ కు, టెక్నికల్ టీమ్ మొత్తానికి కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇక చివరగా, “ఆగస్టు 14న థియేటర్లలో కలుద్దాం!” అంటూ అభిమానులకు ఉత్సాహం కలిగించేలా సందేశం ఇచ్చారు.

Also Read :  Hansi Productions బ్యానర్‌పై యూత్‌ఫుల్ లవ్ డ్రామా ప్రారంభం

ఈ పోస్ట్‌తో ‘వార్ 2’పై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. ఎన్టీఆర్ , హృతిక్ రోషన్ కలయికలో రానున్న యాక్షన్ ఫైట్స్, ఇంటెన్స్ సీన్లు సినిమాపై భారీ హైప్‌ను సృష్టిస్తున్నాయి.