90s Stars Re-Union : గోవాలో 90ల తారల రీయూనియన్.. ఫోటోలు వైరల్!

Reunion1
90s Stars Re-Union : గోవా తీరంలో తాజాగా జరిగిన ఒక ప్రత్యేక సమావేశం 90ల వెండితెర వెలుగులందిన తారలన్నిటినీ ఒక్కచోట కలిపింది. సౌత్ సినిమా చరిత్రలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న దర్శకులు కేఎస్. రవికుమార్, శంకర్, లింగుస్వామి, మోహన్ రాజా, నాట్యం నుంచి దర్శకత్వం వరకు తనదైన ముద్ర వేసిన ప్రభుదేవా, నటులు జగపతి బాబు, మేకా శ్రీకాంత్‌తో పాటు కథానాయికలు సిమ్రాన్, మీనా, సంగవి, మాళవిక, సంగీత, రీమా సేన్, మహేశ్వరి, శివరంజని లాంటి వారు ఈ గేట్ టుగెదర్‌కు హాజరయ్యారు. నాటి సినిమాల జ్ఞాపకాలను పంచుకుంటూ, బీచ్ పక్కన నవ్వుల సందడి చేస్తూ, మళ్లీ ఆ కాలానికి తిరిగిన అనుభూతిని అందరికి ఇచ్చారు.

Also Read :  Vijay Sethupathi: పూరి జగన్నాథ్ ‘స్లమ్‌డాగ్’ ఊచకోత.. మూడు భాషల్లో విజయ్ సేతుపతి ఓన్ డబ్బింగ్ రికార్డ్!

Reunion2

ఈ రీయూనియన్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు తమ చిన్ననాటి హీరోహీరోయిన్లు మళ్లీ ఒకచోట కలవడం చూసి నోస్టాల్జియాలో తేలిపోతున్నారు. ఈ కలయిక కేవలం ఒక పర్సనల్ గెట్టుగెదర్ కాకుండా, 90ల సౌత్ సినిమాకి గౌరవాంజలిగా మారింది. ఆ దశాబ్దంలో ఏర్పడిన బంధాలు ఇప్పటికీ అటు వెండితెరపై, ఇటు నిజ జీవితంలో ఎంత బలంగా ఉన్నాయో ఈ వేడుక స్పష్టంగా చూపించింది.

Also Read :  Sundeep Kishan: విజయ్ కొడుకు సెట్స్‌లో అలా ఉంటాడని ఊహించలేదు: హీరో సందీప్ కిషన్

Reunion3
Reunion4
Reunion5