Actor Thiruveer: విజయ్ దేవరకొండ స్పాట్ బాయ్‌కి ఫోన్ చేసి మరీ.. ఐశ్వర్య రాజేష్ కోసం తిరువీర్ చేసిన క్రేజీ పని!

Actor Thiruveer

Actor Thiruveer: టాలీవుడ్‌లో తన టాలెంట్‌తో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు తిరువీర్ (Thiruveer). ‘మసూద’, ‘పరేషాన్’ వంటి చిత్రాలతో మెప్పించిన ఈ యంగ్ హీరో.. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్‌తో (Aishwarya Rajesh) కలిసి ఓ సుకుమారి అనే సినిమా చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో భాగంగా తిరువీర్, ఐశ్వర్య రాజేష్ ఒకరిపై ఒకరు చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ సందర్భంగా తిరువీర్ మాట్లాడుతూ.. ఐశ్వర్య రాజేష్‌పై తనకున్న అభిమానాన్ని బయటపెట్టారు. “నేను ఐశ్వర్య రాజేష్‌కి చాలా పెద్ద ఫ్యాన్‌ని. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో.. ఎలాగైనా ఐశ్వర్య గారిని చూడాలని అనుకునేవాడిని. అందుకోసం విజయ్ దేవరకొండ స్పాట్ బాయ్‌కు ఫోన్ చేసి, షూటింగ్ ఎక్కడ జరుగుతోందో అడిగి తెలుసుకునేవాడిని. దూరం నుంచైనా ఆవిడను ఒక్కసారి చూడాలనేది నా ఆరాటం. ఆఖరికి ఆవిడ నటిస్తున్నారనే ఒకే ఒక్క కారణంతో నేను కూడా ‘టక్ జగదీష్’ సినిమాలో చిన్న పాత్ర చేశాను” అంటూ తన మనసులోని మాటను పంచుకున్నారు.

Also Read :  Korean Kanaka Raju: థియేటర్లలోకి 'కొరియన్ కనక రాజు'.. ఓటీటీ డీల్ క్లోజ్!

తిరువీర్ చెప్పిన ఈ ఫ్యాన్ బాయ్ ముచ్చట విన్న ఐశ్వర్య రాజేష్ ఎంతో ఎమోషనల్ అవుతూ సరదాగా స్పందించారు. “తిరువీర్ నన్ను చూడటం కోసం ఎంతగా కోరుకున్నాడో చూడండి… కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అప్పట్లో నన్ను దూరం నుంచి చూడాలనుకున్న తిరువీర్, ఇప్పుడు ఏకంగా నాతో కలిసే నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన హీరోగా నటిస్తుంటే, నేను హీరోయిన్‌గా చేస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చారు. వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న ఓ సుకుమారి సినిమాపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.