Akhanda 2 : అఖండ 2 బాక్సాఫీస్ తాండవం… తొలి రోజే బాలయ్య సరికొత్త రికార్డు

Akhanda day1 collections
మాస్‌కి దైవత్వం కలిసినప్పుడు బాక్సాఫీస్‌ వద్ద విధ్వంసమే జరుగుతుంది – అదే నిరూపించింది ‘అఖండ 2: తాండవం’. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో రూపొందిన ఈ చిత్రం థియేటర్లలోకి అడుగుపెట్టిన మొదటి రోజే సరికొత్త రికార్డులు సృష్టించింది. గురువారం జరిగిన గ్రాండ్ ప్రీమియర్స్‌కు అదిరిపోయే స్పందన రాగా, శుక్రవారం థియేటర్లు అభిమానుల జైజైకారాలతో ఊగిపోయాయి.

Also Read :  Peddi : 'పెద్ది' డబ్బింగ్ స్టార్ట్.. వైరల్ అవుతున్న చరణ్ కామెంట్స్!

‘అఖండ 2’ ప్రపంచవ్యాప్తంగా తొలి రోజే రూ.59.5 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి బాలకృష్ణ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. బుక్‌మైషోలోనే 5 లక్షలకుపైగా టికెట్లు అమ్ముడుపోవడం సినిమాపై ఉన్న క్రేజ్‌ను చెప్పకనే చెబుతోంది. చాలా థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి, రిపీట్ ఆడియన్స్ కూడా భారీగా కనిపిస్తున్నారు. విదేశాల్లోనూ బాలయ్య సత్తా మరోసారి నిరూపితమైంది. అమెరికాలో $500K మార్క్‌ను దాటుతూ ‘అఖండ 2’ అద్భుతమైన ఓపెనింగ్ సాధించింది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన ఈ చిత్రాన్ని ఎం. తేజస్విని నందమూరి ప్రెజెంట్ చేశారు. బాలకృష్ణ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు బోయపాటి మార్క్ మాస్ ట్రీట్ తోడవడంతో, వీకెండ్ మొత్తం ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.