Lenin Trailer: రేపే అఖిల్ అక్కినేని ‘లెనిన్’ ట్రైలర్ లాంచ్! వైజాగ్‌లో వెన్యూ ఫిక్స్..

Akhil Akkineni

Lenin Trailer: అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘#లెనిన్’ (#Lenin). ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అక్కినేని అభిమానులు, సినీ ప్రియులకు బిగ్ అప్‌డేట్‌ ఇవ్వడానికి మేకర్స్ రెడీ అయ్యారు. సినిమా ప్రమోషన్లలో భాగంగా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ‘లెనిన్’ అఫీషియల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ టైమ్ అండ్ వెన్యూ ఫిక్స్ అయింది. విశాఖపట్నంలోని ప్రముఖ ‘శరత్ థియేటర్’ ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు వేదిక కానుంది. రేపు (మంగళవారం) సాయంత్రం 4 గంటల నుంచి ఈ ట్రైలర్ లాంచ్ వేడుక అత్యంత ఘనంగా ప్రారంభం కానుందని తాజాగా మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్‌తో పాటు భారీ సంఖ్యలో అభిమానులు హాజరుకానున్నారు.

Also Read :  Venkatramayya Gari Thaluka: 'వెంకట్రామయ్య గారి తాలూకా' టీజర్ వచ్చేసింది .. జూలై 18న రిలీజ్!

ఈ చిత్రంలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్‌ప్రైజెస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎస్. తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. అక్కినేని నాగార్జున సమర్పణలో, వైవిధ్యమైన యాక్షన్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ చిత్రంపై అటు అభిమానుల్లోనూ, ఇటు ట్రేడ్ వర్గాల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ జూలై 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.