
Allari Naresh : కామెడీ కింగ్ అల్లరి నరేష్ తన కొత్త చిత్రం #Naresh65 తో మళ్లీ కామెడీ జానర్‌కి తిరిగివస్తున్నారు. చంద్ర మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్స్ పై రాజేష్ దండ, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు. “కామెడీ గోస్ కాస్మిక్” అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమా ఫాంటసీ, కామెడీ మేళవింపుతో ప్రత్యేకంగా ఉండబోతోందని మేకర్స్ చెబుతున్నారు. ఈరోజు అన్నపూర్ణ స్టూడియోస్‌లో పూజా కార్యక్రమంతో ఈ సినిమా గ్రాండ్‌గా లాంచ్ అయింది. నాగ చైతన్య ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టగా, దర్శకుడు బాబీ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకుడు వి.ఐ. ఆనంద్ ఫస్ట్ షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించగా, వశిష్ట, రామ్ అబ్బరాజు, విజయ్ కనకమేడల స్క్రిప్ట్‌ను నిర్మాతలకు అందజేశారు.
అల్లరి నరేష్‌తో పాటు వెన్నెల కిషోర్, నరేష్ వి.కె., శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ గౌడ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఫాంటసీ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ చిత్రం టెక్నికల్‌గా గ్రాండ్‌గా రూపొందనుంది. రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీని, చేతన్ భరద్వాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్‌గా, చోటా కె ప్రసాద్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానున్న ఈ సినిమా, అల్లరి నరేష్ కెరీర్‌లో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌గా నిలిచే అవకాశం ఉంది.












