
Raaka: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరికొత్త లైనప్‌తో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం అట్లీ డైరెక్షన్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా ‘#Raaka’ (AA22) షూటింగ్‌తో బన్నీ బిజీగా ఉన్నారు. ఈ సినిమా షెడ్యూల్ కోసం ముంబైలోనే ఉంటున్న ఐకాన్ స్టార్, తాజాగా ఈ మూవీ షూటింగ్‌కు ఒక చిన్న బ్రేక్ ఇచ్చి తన నెక్ట్స్ క్రేజీ ప్రాజెక్ట్ కోసం రంగంలోకి దిగినట్లు సమాచారం.
స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో అల్లు అర్జున్ ఒక భారీ పాన్ ఇండియా చిత్రం (#AA23) చేయబోతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తుంది. తాజాగా సమాచారం ప్రకారం, ఈ సినిమాకు సంబంధించి జూన్ 25న ముంబైలో అల్లు అర్జున్‌పై ఒక స్పెషల్ ‘లుక్ టెస్ట్’ మేకర్స్ ప్లాన్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. డైరెక్టర్ సుకుమార్ ‘పుష్ప’ సిరీస్‌తో అల్లు అర్జున్‌ను మాస్, రగ్గడ్ లుక్‌లో సరికొత్తగా ప్రెజెంట్ చేయగా… లోకేశ్ కనగరాజ్ మాత్రం బన్నీ కోసం పూర్తి భిన్నమైన స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ అవతారాన్ని రెడీ చేస్తున్నట్లు సమాచారం.
ఈ సరికొత్త ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం లోకేశ్ టీమ్ ఇప్పటికే ముంబై చేరుకుందని, జూన్ 25న జరగబోయే ఈ సీక్రెట్ లుక్ టెస్ట్‌తో బన్నీ కొత్త మేకోవర్‌ను లాక్ చేయనున్నారని చెబుతున్నారు. ఈ అప్‌డేట్ బయటకు రావడంతో సోషల్ మీడియాలో సరికొత్త చర్చ స్టార్ట్ అయ్యింది. లోకేశ్ కనగరాజ్ సృష్టించిన పాపులర్ ‘లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్’ (LCU) లోకి అల్లు అర్జున్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? లేదా.. లేకపోతే ఇది ఒక ఫ్రెష్ సబ్జెక్టా? అనే దానిపై సోషల్ మీడియా వేదికగా హాట్ హాట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. త్వరలోనే ఈ లుక్ టెస్ట్, రెగ్యులర్ షూటింగ్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేయనున్నారని చెబుతున్నారు.











