Anirudh – Kavya Maran: నవంబర్‌ 10న అనిరుధ్‌–కావ్య మారన్‌ పెళ్లి? వైరల్‌ అవుతున్న డెస్టినేషన్ వెడ్డింగ్‌ న్యూస్‌

Ani Kavya

Anirudh – Kavya Maran: ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ (SRH) ఓనర్ కావ్య మారన్‌ పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వైరల్‌ అవుతున్నాయి. వీరిద్దరి మధ్య కొంతకాలంగా రిలేషన్‌షిప్‌ కొనసాగుతోందంటూ ఇప్పటికే పలు రకాల కథనాలు, ప్రచారాలు తెరపైకి వచ్చాయి. తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. వైరల్‌ అవుతున్న సమాచారం ప్రకారం.. అనిరుధ్‌, కావ్య మారన్‌ నవంబర్‌ 10న వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ వివాహ వేడుకను గ్రీస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్‌గా నిర్వహించేందుకు ఇరు కుటుంబాలు ఏర్పాట్లు చేస్తున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు అనిరుధ్‌ లేదా కావ్య మారన్‌ కుటుంబాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఇదిలా ఉంటే.. అనిరుధ్‌కు సన్నిహిత బంధువు, నటుడు మహేంద్రన్‌ ఇటీవల వీరిద్దరి రిలేషన్ షిప్ గురించి మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. దీంతో అనిరుధ్‌, కావ్య మారన్‌ రిలేషన్‌షిప్‌పై జరుగుతున్న ప్రచారానికి మరింత ఆసక్తి ఏర్పడింది. అయితే పెళ్లి విషయాన్ని మాత్రం ఇప్పటి వరకు కుటుంబ సభ్యులు అధికారికంగా ధ్రువీకరించలేదు. అనిరుధ్‌ ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమలో బిజీ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. మరోవైపు కావ్య మారన్‌ ఐపీఎల్‌ ఫ్రాంచైజీ SRH కార్యకలాపాలతో పాటు వ్యాపార రంగంలో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. నవంబర్‌ 10న గ్రీస్‌లో వీరి వివాహం జరుగుతుందన్న వార్త నిజమా? లేక సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారమేనా? అన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.