Arjun Chakravarthy : కబడ్డీ వీరుని గాథ.. ‘అర్జున్ చక్రవర్తి’ టీజర్ ఎమోషనల్ టచ్!

Arjunchakravarthy
Arjun Chakravarthy : తెలుగు సినీ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే స్పోర్ట్స్ డ్రామాల జాబితాలో మరో శక్తివంతమైన సినిమా చేరబోతోంది. కబడ్డీ ఆటను నేపథ్యంగా తీసుకొని రూపొందిన ‘అర్జున్ చక్రవర్తి’ టీజర్ రిలీజ్‌యి, తక్కువ సమయంలోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. విజయ రామరాజు టైటిల్ పాత్రలో నటించిన ‘అర్జున్ చక్రవర్తి’ టీజర్‌ను ఈ రోజు బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ హను రాఘవపూడి లాంచ్ చేశారు. విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్రీని గుబ్బల నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రానికి 46 అంతర్జాతీయ ఫిల్మ్ అవార్డులు లభించడం విశేషం.

Also Read :  Nidhhi Agerwal: వాటిని పట్టించుకునే ప్రసక్తే లేదు: నిధి అగర్వాల్ బోల్డ్ రియాక్షన్

ఈ సినిమా 1980లలో భారత్‌కి కబడ్డీ రంగంలో గౌరవం తీసుకొచ్చిన ఓ నిజ జీవిత క్రీడాకారుడి ఆధారంగా తెరకెక్కింది. ఒంటి చేత్తో గెలుపును సాధించే అర్జున్, వ్యక్తిగత కారణాలతో ఆటను వదిలేయడం, అతని జీవితం ఎలాంటి మలుపులు తీసుకుందన్నది టీజర్‌లో స్పష్టంగా చూపించారు. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఎమోషనల్ మోమెంట్స్ అన్నీ కలసి సినిమాపై ఆసక్తిని పెంచాయి. టీజర్ చూసిన తర్వాత ఈ సినిమాను బిగ్ స్క్రీన్‌పై చూడాలనే ఉత్సుకత మరింతగా పెరిగిందని ప్రేక్షకులు చెబుతున్నారు. ఇక పోస్ట్‌ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.

Also Read :  Sigma: దళపతి విజయ్ కొడుకు డైరెక్షన్.. దుల్కర్ సల్మాన్ లాంచ్.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న 'సిగ్మా స్టైల్'!