
Arya 40: కోలీవుడ్‌లో తనదైన చిత్రాలతో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న హీరో ఆర్య. ఆయన హీరోగా నటిస్తోన్న ల్యాండ్‌మార్క్ 40వ చిత్రం ‘ఆర్య 40’. తాజాగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఈ చిత్రాన్ని దర్శకుడు నిఖిల్ మురళి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా, ఎమోషన్స్‌తో కూడిన రొమాంటిక్ కామెడీ జోనర్‌లో అద్భుతంగా తెరకెక్కించారని సమాచారం. తాజాగా షూటింగ్ పనులు పూర్తి కావడంతో చిత్రబృందం సెట్స్‌లోనే గ్రాండ్‌గా కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ చేసుకుంది.
ఈ సినిమాలో ఆర్య సరసన ‘బేబీ’ ఫేమ్ వైష్ణవి చైతన్య, మలయాళ ముద్దుగుమ్మ నిఖిలా విమల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. షూటింగ్ ముగిసిన సందర్భంగా చిత్ర యూనిట్ కొన్ని ప్రత్యేకమైన ప్రమోషనల్ ఫోటోలను రిలీజ్ చేసింది. ఇందులో హీరో హీరోయిన్లు సరదాగా ఆడుకుంటూ, నవ్వుతూ కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇటీవలి కాలంలో వరుసగా యాక్షన్, ఇంటెన్స్, సీరియస్ పాత్రలు చేస్తూ వస్తున్న ఆర్య.. చాలా కాలం తర్వాత ఇలాంటి ఒక లైట్ హార్టెడ్ లవ్ అండ్ కామెడీ జానర్‌ను ఎంచుకోవడం విశేషం. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాష్ కుమార్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆర్య తన స్వంత నిర్మాణ సంస్థ ‘ది షో పీపుల్’ బ్యానర్‌పై ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేస్తారని సమాచారం .









