Vachinavaadu Gautam : అశ్విన్ బాబు ‘వచ్చినవాడు గౌతమ్’ బర్త్‌డే స్పెషల్ పోస్టర్ రిలీజ్!

Ashwinbabu
Vachinavaadu Gautam : యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో అశ్విన్ బాబు నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘వచ్చినవాడు గౌతమ్’ టీజర్‌తో హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. మామిడాల ఎం.ఆర్. కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై టి. గణపతి రెడ్డి ప్రొడక్షన్ నెం.3గా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సహ నిర్మాతగా ప్రవల్లిక యోగి వ్యవహరిస్తున్నారు. టీజర్‌కు వచ్చిన ట్రెమండస్ రెస్పాన్స్‌తో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. నేడు అశ్విన్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయనకి విషెష్ అందిస్తూ మేకర్స్ ఒక పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో అశ్విన్ బాబు ఇంటెన్స్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటుంది.

Also Read :  Arya 40: ‘బేబీ’ హీరోయిన్‌తో ఆర్య రచ్చ.. బోట్లపై ఆర్య 40 టీమ్ క్రేజీ సెలబ్రేషన్స్!

ఇటీవలే హైవోల్టేజ్ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్‌ను అత్యాధునిక టెక్నాలజీతో గ్రాండ్‌గా పూర్తి చేశారు. భారీ బడ్జెట్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎలాంటి రాజీ లేకుండా టాప్ ప్రొడక్షన్ విలువలతో పనులు జరుగుతున్నాయి. రియా సుమన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అయేషా ఖాన్, మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్, అజయ్, VTV గణేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సంగీతాన్ని గౌర హరి స్వరపరిచారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే మేకర్స్ విడుదల తేదీ ప్రకటించనున్నారు.