Avatar 3 : ‘అవతార్’ మేనియా ఆన్.. IMAX బుకింగ్స్ డిసెంబర్ 5 నుంచి స్టార్ట్!

Avatarfireandash
Avatar 3 : ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న విజువల్ స్పెక్టకల్ ‘అవతార్: ఫైర్ అండ్ ఆష్’ కోసం కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. భారత్‌లో ఈ సినిమా పై మంచి హైప్ ఉంది. ఈ నేపథ్యంలో IMAX డిసెంబర్ 5 నుంచి దేశవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్‌ను ప్రారంభించబోతోంది. ఫస్ట్ డే–ఫస్ట్ షోను IMAX లేదా డాల్బీ విజన్ స్క్రీన్లలో చూడాలనుకునే ప్రేక్షకులకు ఇది మంచి అవకాశం.

అవతార్‌ విజువల్స్‌ను అత్యద్భుతంగా చూపించడానికి IMAX ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. దేశంలోని అన్ని IMAX థియేటర్లలో అవతార్ థీమ్‌తో బాక్స్ ఆఫీస్ కౌంటర్లు, ఫోటో సెటప్‌లు, ప్రత్యేక డిజైన్లు ఏర్పాటు చేస్తున్నారు. డిమాండ్ ఎక్కువగా ఉండడంతో బెస్ట్ సీట్స్, బెస్ట్ ఎక్స్‌పీరియెన్స్ ముందుగా బుక్ చేసుకునే వారికి మాత్రమే లభిస్తుందని చెబుతోంది. అంతేకాదు ఈసారి అవతార్ ఫ్రాంచైజీ మొదటిసారిగా డాల్బీ విజన్‌లో కూడా విడుదల అవుతోంది. మరింత క్లియర్ విజువల్స్, మంచి కలర్, అద్భుతమైన సౌండ్‌తో సినిమా అనుభవం మరో లెవల్‌లో ఉండబోతోంది.

Also Read :  Sampradayini Suppini Suddapoosani : ఆసక్తికరంగా 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' ట్రైలర్

జేమ్స్ కామెరన్ రూపొందించిన ఈ భారీ సినిమా డిసెంబర్ 19న విడుదల అవుతోంది. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ప్రేక్షకులు చూడవచ్చు. ఇక డిసెంబర్ 5 నుంచి IMAX బుకింగ్స్ ప్రారంభమవుతున్నందున, అవతార్ ఫెస్ట్ ఆఫిషియల్‌గా మొదలైనట్లే. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా బుక్ చేసుకోండి.