Bhola Balayya: బాలయ్య ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా.. 10వ తేదీ బర్త్‌డే సర్‌ప్రైజ్ కంటే ముందే.. జూన్ 7న గ్లోబల్ బ్లాస్టింగ్!

Adhika masa purnima

Bhola Balayya: నటసింహం నందమూరి బాలకృష్ణ మాస్ జాతర మొదలుకాబోతోంది. బాలయ్య ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించే క్రేజీ అప్‌డేట్స్‌తో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడే హీట్ పెరిగిపోయింది. అసలేం జరిగిందంటే.. ప్రముఖ ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ శ్రేయాస్ మీడియా హైదరాబాద్ వేదికగా జూన్ 7న అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘భోళా బాలయ్య’ ఈవెంట్‌ను ప్రకటించింది. ఇందులో బాలకృష్ణ మునుపెన్నడూ చూడని విధంగా, అత్యంత రౌద్ర రూపంలో ‘ఫియర్స్ శివ అవతార్’ (ఉగ్ర శివుని రూపం) లో దర్శనమివ్వనున్నట్లు వెల్లడించింది.

ఈ వేడుకను కేవలం ఒక ఈవెంట్‌లా కాకుండా, గ్లోబల్ ఫ్యాన్ సెలబ్రేషన్‌గా మార్చడానికి మేకర్స్ ప్లాన్ చేశారట. ‘NBK హెల్పింగ్ హ్యాండ్స్’ వంటి సేవా సంస్థలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నందమూరి అభిమాన సంఘాలు ఈ ఈవెంట్‌లో భారీ ఎత్తున పాల్గొనబోతున్నాయని చెబుతున్నారు. జూన్ 10న రాబోయే బాలయ్య పుట్టినరోజు వేడుకలకు ఈ ఈవెంట్ ఒక రేంజ్ కిక్ ఇవ్వనుందని సమాచారం.

Also Read :  Buchi Babu: పెళ్లి రోజున కూడా కంటిమీద కునుకు లేదు.. 'పెద్ది' కోసం బుచ్చిబాబు నెక్స్ట్ లెవెల్ తపస్సు!

‘నో మోర్ వింటేజ్.. ఓన్లీ న్యూ ఏజ్!’
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న NBK111 పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ముఖ్యంగా అందులో ఉన్న “NO MORE VINTAGE. ONLY NEW AGE” అనే ట్యాగ్‌లైన్ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం నుంచి బాలయ్య పుట్టినరోజు (జూన్ 10) ఒక సాలిడ్ అప్‌డేట్ రాబోతోందని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. మొత్తానికి జూన్ 7న జరిగే ఈవెంట్ నుంచి జూన్ 10 బర్త్‌డే బ్లాస్ట్‌ వరకు.. నందమూరి అభిమానులకు బ్యాక్-టు-బ్యాక్ పండగే అని బాలయ్య ఫ్యాన్స్ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.