Bun Butter Jam : ఫ‌న్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘బన్ బటర్ జామ్’ ట్రైలర్ రిలీజ్..

Bunbutterjam
Bun Butter Jam : రాజు జెయమోహన్‌, ఆధ్య ప్రసాద్‌, భవ్య త్రిఖ హీరో హీరోయిన్లుగా, రాఘవ్ మిర్దత్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘బన్ బటర్ జామ్’. ఫన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తమిళంలో మంచి విజయాన్ని సాధించిన ఈ సినిమా, ఇప్పుడు తెలుగులో ఆగస్ట్ 8 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రెయిన్ ఆఫ్ ఎరోస్, సురేష్ సుబ్రమణియన్ నిర్మాణంలో, శ్రీ విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సిహెచ్ సతీష్ కుమార్ తెలుగులో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసారు మేకర్స్.

Also Read :  Rakasa : నవ్విస్తూనే భయపెడుతున్న నిహారిక 'రాకాస' టీజర్

‘సంపాదించిన దాంట్లో సగం పెళ్లికి ఖర్చు పెడుతున్నారు.. మిగతా సగం డైవర్స్‌కి ఖర్చు పెడుతున్నారు’, ‘అసలు నేను చేస్తోంది లవ్వో కాదో తెలియట్లేదే’, ‘ఏ రిలేషన్ షిప్‌లో అయినా రెండు వైపుల ప్రేమ, మర్యాద సమానంగా ఉండాలి’.. ‘మీరు రాను రాను పిచ్చి వాళ్లలా బిహేవ్ చేస్తున్నారు’.. ‘అవునురా మేమంతా పిచ్చివాళ్లమే.. మీ లైఫ్ అంతా బాగుండాలని అనుకుంటున్నాం కదా’ అని తల్లీకొడుకుల మధ్య సంభాషణ.. ట్రైలర్ చివర్లో వచ్చే ‘ఇష్టమైతే పెళ్లి చేసుకుంటున్నారు. లేకపోతే డైవర్స్ తీసుకుంటున్నారు.. మీ జనరేషన్‌‌ను అర్థం చేసుకునే ప్రయత్నంలో ఓడిపోతున్నాం’ అంటూ తల్లి చెప్పే డైలాగ్‌ను బట్టి ఈ సినిమా కథ, కథనాలు ఎలా ఉండబోతోన్నాయో అర్థం అవుతోంది. ఈ ట్రైలర్‌ను బట్టి చూస్తే ఇది యూత్ ఫుల్, లవ్, ఫ్యామిలీ, రొమాంటిక్, కామెడీ సినిమా అని తెలుస్తోంది.

Also Read :  స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల