Carmeni Selvam Teaser : రిచ్ కావాలంటే ఖర్చు చేయడం నేర్చుకోవాలి

Karmeni selvam teaser
పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా, రామ్ చక్రి దర్శకత్వంలో రూపొందుతున్న ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రముఖ నటుడు సముద్రఖని ప్రధాన పాత్ర పోషించగా, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. లక్ష్మీ ప్రియా, అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్ తదితరులు నటిస్తున్నారు. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా ఈ చిత్రం ఏప్రిల్ 3, 2026న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.

Also Read :  Geethu Mohandas: డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ బర్త్‌డే గిఫ్ట్ అదిరింది.. వైరల్ అవుతున్న ‘టాక్సిక్’ వీడియో!

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచిన ఈ సినిమా నుంచి తాజాగా తెలుగు టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. “డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి” అనే సముద్రఖని వాయిస్ ఓవర్‌తో ప్రారంభమయ్యే టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అధిక ఖర్చులు, భారీ లోన్లు, క్రిప్టో పెట్టుబడులు, త్వరగా ధనవంతులు కావాలనే ఆశతో చేసే ప్రయత్నాలు వంటి అంశాలను చూపిస్తూ నేటి సమాజంలో డబ్బు పట్ల ఉన్న మనస్తత్వాన్ని సినిమా ప్రతిబింబించేలా టీజర్ రూపొందించారు.

Also Read :  Rashmika Mandanna: ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్‌లో నేషనల్ క్రష్.. !

టీజర్‌లో ఈఎంఐలు, క్రెడిట్ కార్డులపై ఆధారపడే జీవనశైలి మరియు డబ్బు కోసం మనుషులు తీసుకునే నిర్ణయాలు కథలో కీలకంగా ఉండబోతున్నాయని అర్థమవుతోంది. సముద్రఖని కుటుంబంతో కనిపించే సన్నివేశాలు భావోద్వేగాన్ని కలిగిస్తుండగా, విదేశాల్లో ఒంటరిగా కనిపించే కొన్ని షాట్లు కథపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. చివర్లో “రిచ్ కావాలంటే రిచ్ మనిషిలా ఖర్చు చేయడం నేర్చుకోవాలి… డబ్బు లేకపోతే అప్పు తీసుకుని ఖర్చు చేయాలి” అనే డైలాగ్ ప్రేక్షకులను ఆలోచింపజేస్తూ టీజర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.