Vayuputra : చందూ మొండేటి దర్శకత్వంలో వస్తున్న భారీ 3D యానిమేషన్ ఎపిక్ ‘వాయుపుత్ర’

Vayuputra
Vayuputra : మన చరిత్ర, ఇతిహాసాలలో అపారమైన స్థానం కలిగిన వాయుపుత్రుడు హనుమంతుడి గాథను ఆధారంగా చేసుకుని ‘వాయుపుత్ర’ చిత్రం రూపుదిద్దుకుంటోంది. సప్త చిరంజీవులలో ఒకరైన హనుమంతుడు శౌర్యం, భక్తి, అచంచల విశ్వాసానికి ప్రతీక. చందూ మొండేటి దర్శకత్వం, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ 3D యానిమేషన్ చిత్రం, హనుమంతుడి కాలాతీత కథను గొప్ప దృశ్యకావ్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. 2026 దసరా సందర్భంగా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం, చరిత్ర, భక్తి, ఆధునిక సాంకేతికతల సమ్మేళనంగా నిలవనుంది.

Also Read :  Rakasa : నవ్విస్తూనే భయపెడుతున్న నిహారిక 'రాకాస' టీజర్

ఈ చిత్ర ప్రకటనలో విడుదల చేసిన పోస్టర్‌లో హనుమంతుడు కొండపై నిలబడి, దహనమవుతున్న లంకను తిలకిస్తున్న దృశ్యం ఆధ్యాత్మిక గాంభీర్యాన్ని ప్రతిబింబిస్తోంది. ఇది కేవలం సినిమా కాదు, థియేటర్లను దేవాలయాలుగా మార్చే భక్తి యాత్ర. చందూ మొండేటి దార్శనికత, నాగవంశీ నిర్మాణ నైపుణ్యం కలిసిన ‘వాయుపుత్ర’, భారతీయ సినిమాకు కొత్త ప్రమాణాలు సృష్టిస్తూ విశ్వాసం, శౌర్యం, విధి యొక్క వేడుకగా నిలిచే అద్భుతమైన సినిమాటిక్ మైలురాయిగా మారనుంది. ‘వాయుపుత్ర’ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.