Chiranjeevi: ‘చెన్నై లవ్ స్టోరీ’ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా మెగాస్టార్..

Megastar Chiranjeevi

Chiranjeevi: ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ప్రమోషన్స్‌కు మరింత ఊపు తీసుకొచ్చే వార్త ఒకటి బయటకు వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరుకానున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్తలతో సోషల్ మీడియాలో ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాపై ప్రత్యేకమైన హైప్ నెలకొంది. తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏ సినిమా ఈవెంట్‌కు హాజరైనా ఆ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణ తీసుకొస్తారు. ఇప్పుడు ‘చెన్నై లవ్ స్టోరీ’ ఈవెంట్‌కు కూడా ఆయన ముఖ్య అతిథిగా రానున్నట్లు వార్తలు రావడంతో అభిమానుల్లో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై ప్రత్యేక ఆసక్తి నెలకొంది.

ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొనే అవకాశం ఉందట. చిరంజీవి సినిమా గురించి ఏమి మాట్లాడతారు? అనే అంశాలపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా రానున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో హీరోగా యువ హీరో కిరణ్ అబ్బవరం, తెలుగమ్మాయి శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా జూలై 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది.