
The Bloody Benchmark: మెగాస్టార్ చిరంజీవి హీరోగా, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి (కె.ఎస్. రవీంద్ర) డైరెక్షన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘#Mega158’. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ భారీ విజయాన్ని నమోదు చేయడంతో, ఈ సరికొత్త ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో, మెగా అభిమానుల్లో, ట్రేడ్ వర్గాల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రాన్ని ‘కేవీఎన్ ప్రొడక్షన్స్’ పతాకంపై వెంకట్ కె. నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో, ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
తాజాగా మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన మెగా అప్డేట్ను మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని ఆగస్టు 22న విడుదల చేయనున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఈ చిత్రంలో మెగాస్టార్ గతంలో ఎన్నడూ చూడని అత్యంత పవర్ఫుల్, ఇంటెన్స్ రోల్లో కనిపించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. తాజాగా మేకర్స్ చేసిన పోస్ట్‌లో ‘ది బ్లడీ బెంచ్‌మార్క్’తో ఈ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచారు. ఈ సినిమాలో మలయాళ నటి అనస్వరా రాజన్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమాకు టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిరంజీవి మార్క్ మాస్ ఎలిమెంట్స్‌కు తమన్ అందించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో శరవేగంగా జరుగుతోంది.
AUG 22nd 🔥🔥🔥🔥🔥#Mega158 ❤️ https://t.co/Zq1X5ZRhqD
— Bobby (@dirbobby) July 3, 2026











