
Kodama Simham : మెగాస్టార్ చిరంజీవి నటించిన ఐకానిక్ హిట్ చిత్రాల్లో కే. మురళీ మోహన్ రావు దర్శకత్వం వహించిన ‘కొదమ సింహం’ ప్రత్యేకస్థానం కలిగి ఉంది. 1990లో అంటే 35 సంవత్సరాల క్రితం విడుదలైన ఈ చిత్రం అప్పట్లో సెన్సేషనల్ హిట్‌గా నిలిచి, తెలుగు సినీ పరిశ్రమలో కొత్త ప్రయోగంగా నిలిచింది. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత నవంబర్ 21వ తేదీన కొదమ సింహం రీ-రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో 35 సంవత్సరాల క్రితం చేసిన ‘కొదమ సింహం’ లుక్‌ను మళ్లీ రీ-క్రియేట్ చేసి అభిమానులకు అందమైన సర్‌ప్రైజ్ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి.
ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, మెగాస్టార్ స్క్రీన్ ప్రజెన్స్, సాటిలేని చరిస్మా దశాబ్దాల క్రితం ఉన్నట్లే ఇప్పుడు కూడా అంతే పవర్ ఫుల్ గా వుంది. ఇక 35 ఏళ్ల క్రితం అద్భుత విజయాన్ని సాధించిన ‘కొదమ సింహం’ ను బిగ్ స్క్రీన్‌పై మళ్లీ చూడబోతున్నామన్న ఆనందంతో అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. అయితే రామ్ చరణ్ కి ఈ సినిమా అంటే చాలా ఇష్టమని, చిన్నప్పుడు భోజనం చేయాలంటే.. వాళ్ళ అమ్మ ఈ సినిమా వేస్తే కానీ తినేవాడు కాదని చిరంజీవి తెలిపారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ నవంబర్ 21న థియేటర్లలో మెగాస్టార్ టైమ్‌లెస్ ప్రెజెన్స్‌ని మరోసారి ఆస్వాదించండి.









