Chiyaan63: అఫీషియల్‌గా స్టార్ట్ అయిన ‘చియాన్ 63’.. ‘ఇరు ముగన్’ డైరెక్టర్‌తో విక్రమ్ క్రేజీ కాంబో!

Chiyaan63

Chiyaan63: కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కొత్త సినిమా అధికారికంగా పట్టాలెక్కింది. గతంలో విక్రమ్‌కు ‘ఇరు ముగన్’ (తెలుగులో ‘ఇంకొక్కడు’) లాంటి సూపర్ హిట్ అందించిన టాలెంటెడ్ డైరెక్టర్ ఆనంద్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. తాజాగా ఈ సినిమా అధికారికంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. గతంలో విక్రమ్, ఆనంద్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇంకొక్కడు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా, విక్రమ్ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా నిలిచింది. ఇప్పుడు మళ్లీ అదే కాంబో రిపీట్ అవుతుండటంతో కోలీవుడ్ వర్గాలతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులలోనూ ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Also Read :  Jr NTR: ట్విట్టర్‌లో సరదా కామెంట్‌.. నిజం చేసిన తారక్! ఎన్టీఆర్ గిఫ్ట్ చూసి అభిమాని కన్నీళ్లు..

ఈ చిత్రానికి సంబంధించిన మరికొన్ని ఆసక్తికరమైన వివరాలు కూడా మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రానికి పాపులర్ అండ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఆయన మార్క్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు పెద్ద అసెట్ కానుందని చెబుతున్నారు. ఈ సినిమాలో విక్రమ్ సరసన టాలెంటెడ్ బ్యూటీ రియా షిబు హీరోయిన్‌గా నటిస్తున్నారు. టాలీవుడ్, కోలీవుడ్‌లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ సత్యజ్యోతి ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. సరికొత్త స్టోరీ లైన్‌తో, హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కబోతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుందని టాక్. ఈ క్రేజీ అప్‌డేట్‌తో చియాన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హంగామా షురూ చేశారు.