Actor Darshan : జైలు జీవితం భరించలేను.. విషం ఇవ్వండి : నటుడు దర్శన్

Darshan
Actor Darshan : కన్నడ సినీ నటుడు దర్శన్ ప్రస్తుతం రేణుకాస్వామి హత్య కేసులో పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. హైకోర్టు నుంచి బెయిల్ లభించినా, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేయడంతో అది రద్దయి మళ్లీ జైలుకి వెళ్లారు. తాజాగా, బెంగళూరు సిటీ సివిల్ మరియు సెషన్స్ కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన ఆయన, జైలు గదిలోని దయనీయ పరిస్థితులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గదిలో ఎండ రాకపోవడం, దుస్తుల నుంచి దుర్వాసన రావడం, గోడలన్నీ ఫంగస్ పట్టడం వంటి సమస్యలు ఉన్నాయని, తాను చాలా రోజులుగా సూర్యుడిని చూడ‌లేద‌ని.. ఇలాంటి ప‌రిస్థితుల్లో బ‌త‌క‌డం అసాధ్యం కాబట్టి దయచేసి విషమివ్వండి అంటూ కన్నీళ్లతో కోర్టులో చెప్పారు.

Also Read :  ఏప్రిల్ 3న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతున్న   తెలుగు–తమిళ  ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’...

న్యాయమూర్తి దర్శన్ అభ్యర్థనను తిరస్కరించి, ఇలాంటి మాటలు చెప్పొద్దని సూచించారు. అయితే, ఆయనకు కనీస సౌకర్యాలు కల్పించాలని జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదనంగా పరుపులు, బెడ్‌షీట్లు ఇవ్వడం, తిరగడానికి అనుమతి కల్పించడం వంటి విషయాలను స్పష్టంగా పేర్కొన్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తూ, కొందరు దర్శన్‌కు మద్దతుగా నిలవగా, మరికొందరు నెగెటివ్‌గా స్పందిస్తున్నారు.

Also Read :  Suriya46 : సూర్య - వెంకీ అట్లూరి మూవీకి క్లాసీ టైటిల్ ఫిక్స్..

నిపుణుల అభిప్రాయం ప్రకారం, దర్శన్ ఆవేదన జైలు వ్యవస్థలో ఉన్న లోపాలను మరోసారి బయటపెట్టింది. ఒక ప్రముఖ నటుడు కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు, సామాన్య ఖైదీల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచించాల్సిన అవసరం ఉందని వారు సూచిస్తున్నారు.