Dhandoraa Movie : ఈ ఏడాదికి డ్రామాటిక్ ఎండ్..’దండోరా’ క్రిస్మస్‌కి థియేటర్లలో!

Dhandoraa
Dhandoraa Movie : ‘కలర్ ఫోటో’, ‘బెదురులంక 2012’ వంటి సక్సెస్ సినిమాలు నిర్మించిన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని కొత్తగా రూపొందిస్తున్న చిత్రం ‘దండోరా’. మురళీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విల‌క్ష‌ణ న‌టుడు శివాజీతో పాటు నవదీప్, నందు, బిందు మాధవి, రవి కృష్ణ, మణిక, అనూష, రాధ్య‌ తదితరులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం పోస్టర్ ద్వారా తెలిపింది. ఒక ఖాళీ ప్రదేశంలో తవ్విన గొయ్యి, “ఈ ఏడాదికి డ్రామాటిక్ ఎండ్” అన్న క్యాప్షన్‌తో పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Also Read :  Peddi : 'పెద్ది' డబ్బింగ్ స్టార్ట్.. వైరల్ అవుతున్న చరణ్ కామెంట్స్!

Dhandoraa1

అగ్ర వర్ణాలకు చెందిన అమ్మాయిలు ప్రేమించి పెళ్లి చేసుకున్నా, అగ్ర వర్ణాలకు ఎదురు తిరిగినా ఎలాంటి దౌర్జన్యకాండ జరుగుతున్నాయనే అంశాన్ని ఆధారంగా చేసుకుని ‘దండోరా’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తెలంగాణ గ్రామీణ నేప‌థ్యంలో మ‌న పురాత‌న ఆచారాలు, సాంప్ర‌దాయాల‌ను ఆవిష్క‌రిస్తూనే వ్యంగ్యం, చ‌క్క‌టి హాస్యం, హృద‌యాన్ని హ‌త్తుకునే భావోద్వేగాల క‌ల‌యిక‌గా ఈ సినిమాను ఆవిష్కరిస్తున్నారు. ఈ చిత్రానికి మార్క్ కె. రాబిన్ సంగీతం అందిస్తుండగా, వెంకట్ ఆర్. శాఖమూరి సినిమాటోగ్రఫీ, సృజన అడుసుమిల్లి ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు. ఇక ఈ సినిమాను అథ‌ర్వ‌ణ భ‌ద్ర‌కాళి పిక్చ‌ర్స్ ఓవ‌ర్‌సీస్ రిలీజ్ చేస్తోంది.