Thamizh Murugan: ఏనుగుపై ధనుష్ వీరవిహారం.. ‘తమిళ్ మురుగన్’ గ్లింప్స్ చూశారా?

Thamizh Murugan

Thamizh Murugan: కోలీవుడ్‌తో పాటు తెలుగులోను తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్న వర్సటైల్ యాక్టర్ ధనుష్, సెన్సేషనల్ డైరెక్టర్ వెట్రిమారన్ మరోసారి జతకట్టారు. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘పొల్లాదవన్’, ‘ఆడుగలం’, ‘వడ చెన్నై’, ‘అసురన్’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టించాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో రాబోతున్న సరికొత్త చిత్రానికి ‘తమిళ్ మురుగన్’ (Thamizh Murugan) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ టైటిల్ అనౌన్స్‌మెంట్ గ్లింప్స్‌ను తాజాగా మేకర్స్ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు.

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను మేకర్స్ ఒక ప్రముఖ నవల ఆధారంగా విజువల్ వండర్‌గా తెరకెక్కిస్తున్నారని సమాచారం. ప్రముఖ రచయిత, కవి అరివుమతి అందించిన కథతో వెట్రిమారన్ ఈ ఇంటెన్స్ డ్రామాను రూపొందిస్తున్నారట. తాజాగా రిలీజ్ చేసిన గ్లింప్స్‌లో యుద్ధ క్షేత్రంలో వేలాది మంది సైనికుల మధ్య ధనుష్ ఒక భారీ ఏనుగుపై వీరుడిలా కూర్చొని ఉన్న విజువల్స్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. “ది ఎటర్నల్ ప్రొటెక్టర్, వారియర్, తమిళ ప్రజలు, వారి నేలకి రాజు, నాయకుడు.. #sonofkottravai తమిళ్ మురుగన్” అంటూ ధనుష్ పెట్టిన క్యాప్షన్ నెట్టింట ఫుల్ వైరల్ అవుతోంది. వెట్రిమారన్ మార్క్ రా అండ్ రస్టిక్ మేకింగ్‌కు తోడు, ధనుష్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ తోడవుతుండటంతో ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని వండర్‌బార్ ఫిలింస్, ప్రొడక్షన్ మైల్స్ టు గో బ్యానర్లపై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండటం విశేషం. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను చిత్ర యూనిట్ త్వరలోనే అధికారికంగా వెల్లడించనుంది.