B.Town Beauty : ఇన్‌స్టాగ్రామ్‌ హీట్.. అందాల భామ ఘాటు ఫోజు..!

Disha

B.Town Beauty : బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోతో నెటిజన్‌లను కట్టిపడేస్తోంది. వర్షపు నీటిలో పడుకున్నట్లుగా తీసిన ఈ హాట్ ఫోటోలో దిశా ఎరుపు టాప్‌లో మెరిసిపోయింది. చుట్టూ వర్షపు చినుకులు పడుతున్న ఆ సున్నితమైన వాతావరణంలో దిశా అందాన్ని కురిపిస్తూ తన గ్లామర్ డోస్‌తో ట్రెండింగ్‌ చేస్తోంది. ఈ పోస్టుకు ఆమె “CKay – Forever” పాటను బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌గా పెట్టడం విశేషం.

ఇదిలా ఉంటే… దిశా త్వరలో షాహిద్ కపూర్‌తో కలిసి ఓ పెద్ద ప్రాజెక్టులో నటించనుంది. ప్రముఖ దర్శకుడు విశాల్ భారద్వాజ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా 2025 డిసెంబర్ 5న విడుదల కానుంది. ఈ ఏడాది ప్రారంభంలో ‘దేవా’ సినిమాతో బాక్సాఫీస్‌ హిట్ అందుకున్న షాహిద్, ఇప్పుడు ఈ యాక్షన్ డ్రామాతో మరో హిట్ కోసం సిద్ధమవుతున్నాడు. ఇందులో త్రిప్తీ దిమ్రి కూడా ముఖ్యపాత్రలో నటిస్తోంది. దిశా పటానీ మాత్రం ఓ స్పెషల్ అప్పియరెన్స్‌లో మెరుపులు మెరిపించనుంది.

Also Read :  Rakasa : నవ్విస్తూనే భయపెడుతున్న నిహారిక 'రాకాస' టీజర్

ఈ సినిమాకు సంబంధించి రెండు ప్రత్యేకమైన డాన్స్ నంబర్ల కోసం భారీ సెట్స్‌ను రూపొందించారని సమాచారం. ఈ పాటలలో దిశా, షాహిద్‌తో కలిసి నర్తించనుంది. వీరిద్దరి కాంబినేషన్‌కు ఇప్పటికే ఫ్యాన్స్‌ లో క్రేజ్‌ మొదలైంది. ఇదే విషయమై దిశా స్పందిస్తూ – “షాహిద్‌తో డాన్స్ చేయడం కోసం నేను ఎంతో ఎగ్జైటెడ్‌గా ఉన్నాను. ఇది ఒక మస్త్ అనుభవం అవుతుంది” అంటూ తన ఉత్సాహాన్ని వ్యక్తం చేసింది.

Also Read :  Sampradayini Suppini Suddapoosani : ఆసక్తికరంగా 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' ట్రైలర్

ఇదే సినిమాతో దిశా, షాహిద్ జోడీగా తొలిసారి స్క్రీన్ షేర్ చేయనుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. స్పెషల్ సాంగ్స్‌లో ఈ జోడీ కురిపించే స్టెప్పులకూ, కెమిస్ట్రీకూ ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. షాహిద్ ఎనర్జీకి దిశా గ్లామర్ మేళవిస్తే మాస్‌లో ఈ పాటలు డబుల్ హిట్ అవుతాయని బాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.